ఏగెదను నే చేరెదను
Aegedanu Nae Chaeredanu
Lyricistజాషువా షేక్
UncategorizedAdded on 6/6/2020
Lyrics
ఏగెదను నే చేరెదను సీయోనును నే చూచెదను విశ్వాస కర్తయైన నా యేసూ నీ సముఖములో నే మురిసెదను నీ కౌగిలిలో ఉప్పొంగెదను జీవ కిరీటమును నే పొందెదను ||ఏగెదను|| భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును దినదినము నాలో నే చనిపోవుచున్నాను అనుదినము నీలో బ్రతుకుచున్నాను అనుదినము నీలో బ్రతుకుచున్నాను ||ఏగెదను|| నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను మంచి పోరాటముతో నా పరుగును కడముట్టించి జయమొందెదను విశ్వాసములో జయమొందెదను ||ఏగెదను||