ఏలో ఏలో ఏలో అంటూ
Aelo Aelo Aelo Amtoo
Lyricistజాషువా షేక్
UncategorizedAdded on 12/14/2022
Lyrics
ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి – హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి – హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి – నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో|| లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో|| వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో|| ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా మన యేసయ్య మనకుండగా ||ఏలో||