ఏం చేసానయ్యా నీకోసం

Aem Chaesaanayyaa Neekosm

Lyricistసిరివెళ్ల హనోక్
UncategorizedAdded on 11/2/2015

Lyrics

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా
||ఏం చేసానయ్యా||
ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా
(2) ||ఏం చేసానయ్యా||
ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా
(2) ||ఇప్పటికైనా ||
ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా
(2) ||ఇప్పటికైనా ||

Video