ఏమివ్వగలనయ్య నా యేసయ్యా

Aemivvagalanayya Naa Yaesayyaa

UncategorizedAdded on 1/8/2017

Lyrics

ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై
నిన్ను గూర్చి లోకమంత చాటనా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా
(2)         ||ఏమివ్వగలనయ్య||
గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణించలేను నా యేసయ్యా
(2)         ||నిన్ను గూర్చి||
ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు
(2)         ||నిన్ను గూర్చి||

Video