ఏపాటి దాననయా
Aepaati Daananayaa
Lyricistక్రిసోస్తం
UncategorizedAdded on 9/9/2019
Lyrics
ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరియించి నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది ||ఏపాటి|| కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరు నను విడచినా నను విడువని యేసయ్యా విడువను యెడబాయనని నా తోడై నిలచితివా ||ప్రేమించే|| నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ||ప్రేమించే||