అగ్ని మండించు

Agni Mmdimchu

Lyricistఫ్రెడ్డీ పాల్
UncategorizedAdded on 10/10/2016

Lyrics

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు
అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే
(2)       ||అగ్ని||
అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే
(2)       ||అగ్ని||
అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే
(2)       ||అగ్ని||
ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా
(2)       ||అగ్ని||

Video