అల్ఫా ఒమేగయైన
Alphaa Omaegayaina
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 2/11/2018
Lyrics
అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా|| కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను జీవించెద నీ కొరకే హర్షించెద నీలోనే (2) ||అల్ఫా|| తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నను చేసెను నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే (2) ||అల్ఫా|| నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే (2) ||అల్ఫా||