అంబరానికి అంటేలా
Ambaraaniki Amtaelaa
UncategorizedAdded on 11/7/2016
Lyrics
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు దీనులను రక్షించే దేవ తనయుడు దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె విజయ వీరుడై ఉద్భవించెనే పశుల పాకలో పరుండియుండెనే ||లాల|| ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే లోకానికి రక్షకుడు వెలిసెనని తార వెంబడి వెళ్లి వారు కానుకలర్పించి ఆరాధించారు ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి ||లాల|| ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు దూత గణములే జోల పాడగా సృష్టికి బహు సంబరమాయెగా ||లాల||