అంబరాన్ని దాటే
Ambaraanni Daatae
Lyricistసాయారాం గట్టు
UncategorizedAdded on 11/19/2019
Lyrics
అంబరాన్ని దాటే సంబరాలు నేడు నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు రండయ్యో రండి రండి దావీదు పురముకు రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని|| దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము ఏకైక తనయుని పంపెను ఈ దినము పశువుల పాకలో ఒదిగేను శిశువుగా అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో|| దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ లోకాల కారకుడు లోకమున పుట్టెను మనిషి మరణము ఆయువు తీరెను (2) ||రండయ్యో||