అందాల బాలుడు
Amdaala Baaludu
LyricistSayaram Gattu
UncategorizedAdded on 10/29/2021
Lyrics
అందాల బాలుడు ఉదయించినాడు లోకాలు వెలిగించు నీతి సూరీడు రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి గొల్లలము మేము కల్లలు ఎరుగము కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో|| తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము దారి చూపే తార రారాజునే జేర మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో|| తనలోని వెలుగంత పంచేటి పావనుడు మనలోని పాపమంత తీసేయు రక్షకుడు చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో||