అందాలు చిందే

Amdaalu Chimdae

Lyricistరమేష్
UncategorizedAdded on 6/29/2017

Lyrics

అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ
కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే
(2)       ||అందాలు||
చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం
(2)       ||అందాలు||
సంసార సాగర పయనం
తెర చాటు అనుభూతి వినయం
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం
(2)       ||అందాలు||
యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో
(2)       ||అందాలు||

Video