అమూల్యమైన ఆణిముత్యమా

Amoolyamaina Aanimuthyamaa

UncategorizedAdded on 6/26/2018

Lyrics

రేచెల్ జ్యోతి కొమానపల్లి
అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు
(2)        ||అమూల్యమైన||
జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు
(2)        ||అమూల్యమైన||
చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు
(2)        ||అమూల్యమైన||
దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు
(2)        ||అమూల్యమైన||

Video