అన్నీ సాధ్యమే యేసుకు

Annee Saadhyamae Yaesuku

UncategorizedAdded on 8/12/2017

Lyrics

జే సీ కూచిపూడి
అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
(2)           ||అన్నీ సాధ్యమే||
మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను
మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను
(2)           ||అన్నీ సాధ్యమే||
బండనే చీల్చగా – జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను
బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని
మెండైన తన కృపలో – నీకండగా నిలచును
(2)           ||అన్నీ సాధ్యమే||
ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము
యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును
(2)           ||అన్నీ సాధ్యమే||
కష్టాల కడలిలో – కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును
కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము
(2)           ||అన్నీ సాధ్యమే||

Video