అన్ని నామముల కన్న
Anni Naamamula Kanna
UncategorizedAdded on 10/31/2015
Lyrics
ఎం జ్యోతి రాజు అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము ||యేసు నామము || సాతాను పై అధికార మిచ్చును శక్తి గల యేసు నామము శత్రు సమూహము పై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము ||యేసు నామము || స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేయుదము ||యేసు నామము ||