అన్ని సాధ్యమే యేసులో
Anni Saadhyamae Yaesulo
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 8/24/2021
Lyrics
నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు|| నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనే బండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనే నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే నీటిపై నడిచెనే – నీటినే అణచెనే నా కన్నీటిని నాట్యముగ మార్చెనే జీవ జలమైన నా యేసయ్యా… ||సాధ్యము|| హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనే బలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనే షద్రకు మేషాకు అబేద్నెగోలను అగ్నిలో ఉండియే కాపాడెనే నరకపు మంటనుండి నను రక్షించిన అగ్ని నేత్రాల నా యేసయ్యా… ||సాధ్యము||