అన్ని వేళల వినువాడు

Anni Vaelala Vinuvaadu

Lyricistజి ఫీనెహాసు
UncategorizedAdded on 8/8/2017

Lyrics

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును
||అన్ని||
కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక
వేదన చెందుతూ నిరాశలో మునిగావా
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే
(2)     ||అన్ని||
ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే
(2)     ||అన్ని||

Video