అన్యజనులేల
Anyajanulaela
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 6/15/2021
Lyrics
అన్యజనులేల లేచి గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి (2) ||అన్యజనులేల|| భూలోక రాజులు లేచి వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు వారి పాశములను తెంపి పారవేయుద మనుచున్నారు (2) ||అన్యజనులేల|| ఆకాశ వాసుండు వారిని అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు వారలతో పల్కి కోపముతో వారిని తల్లడిల్ల చేయును (2) ||అన్యజనులేల|| పరిశుద్ధమైన నాదు పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన నారాజు నాసీనునిగా జేసి యున్నానని సెలవిచ్చెను (2) ||అన్యజనులేల|| కట్టడ వివరింతు నాకు యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు నీవు నా కుమారుడవు నిన్ను నేను కనియున్నాను (2) ||అన్యజనులేల|| నన్ను అడుగుము నీకు జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము దిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2) ||అన్యజనులేల|| ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో కుండను పగులగొట్టునట్లు వారిని పగులగొట్టెదవు (2) ||అన్యజనులేల|| ఓ రాజులారా మీరు జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా ఓ భూపతులారా మీరు నాభోద నొందుడి నేడే (2) ||అన్యజనులేల||