అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
Athiparishuddhudaa Sthuthi Naivaedyamu
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 7/19/2025
Lyrics
అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా ||అతిపరిశుద్ధుడా|| సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి (2) ||అతిపరిశుద్ధుడా|| సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా (2) ||అతిపరిశుద్ధుడా|| సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతిక్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి (2) ||అతిపరిశుద్ధుడా||