అత్యున్నతమైనది యేసు నామం

Athyunnathamainadi Yaesu Naamm

UncategorizedAdded on 10/15/2016

Lyrics

షూలమ్మీతీ ఫిన్నీ పచిగళ్ల
అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం
అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం
ఉన్నత నామం – సుందర నామం
ఉన్నత నామం – శ్రీ యేసు నామం
అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం
యేసు నామం – యేసు నామం
ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును
ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును
పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా
పరలోక దీవెనలు పొందగ చేరుము
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
||అత్యున్నత||
పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్
మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును
పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా
పరలోక దీవెనలు పొందగ చేరుము
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
||అత్యున్నత||

Video