అవధులే లేనిది

Avadhulae Laenidi

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 3/23/2017

Lyrics

అవధులే లేనిది దివ్యమైన నీ కృప
అనంతమైనది ఆశ్చర్యమైనది
యేసయ్యా నాపై నీవు చూపిన కృప
అమూల్యమైనది వర్ణించలేనిది
(2)        ||అవధులే||
ఊహించలేని హృదయానందమును
దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు
భారమెక్కువైనా తీరం కడుదూరమైనా
నీపై ఆనుకొందును
నేను గమ్యం చేరుకొందును
(2)        ||అవధులే||
సరిపోల్చలేని మధురమైన అనుభవం
వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు
సౌందర్యమైన అతిపరిశుద్ధమైన
నీ రూపము తలచుకొందును
నేను నీ కోసమే వేచియుందును
(2)        ||అవధులే||
లెక్కించలేని అగ్ని శోధనలో
ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు
వాడబారని కిరీటము నే పొందుటకు
వెనుకున్నవి మరచి
నేను లక్ష్యము వైపు సాగెద
(2)        ||అవధులే||

Video