అయ్యా నా కోసం కల్వరిలో

Ayyaa Naa Kosm Kalvarilo

Lyricistభరత్
UncategorizedAdded on 3/14/2017

Lyrics

అయ్యా నా కోసం కల్వరిలో
కన్నీరును కార్చితివా
నశించిపోవు ఈ పాపి కొరకై
సిలువను మోసితివా
అయ్యా వందనమయ్యా
యేసు వందనమయ్యా
పడిపోయి ఉన్న వేళలో
నా చేయి పట్టి లేపుటకు
గొల్గొతా కొండపై పడిపోయిన
యేసు నా కొరకు తిరిగి లేచితివి
(2)          ||అయ్యా వందనమయ్యా||
అనాథ నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు
ఒంటరిగా ఉన్న మరియను
యేసు యోహానును అప్పగించితివి
(2)          ||అయ్యా వందనమయ్యా||

Video