అయ్యా వందనాలు

Ayyaa Vmdanaalu

Lyricistజేమ్స్ ఎజెకియెల్
UncategorizedAdded on 1/10/2024

Lyrics

అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే
మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే
నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే
ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు
అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు
(2)       ||అయ్యా||
అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే
కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా
జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా
(2)       ||అయ్యా||

Video