బాల యేసుని జన్మ దినం
Baala Yaesuni Janma Dinm
UncategorizedAdded on 2/5/2017
Lyrics
వేడుకైన శుభ దినము సేవింప రారే జనులారా ముద్దుల బాలకు ముద్దులిడ ||బాల|| మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని చేకొని లాలింప రారే జో జోల పాటలు పాడి ||బాల|| పాపికి పరమ మార్గము జూప ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు పశుశాలయందు పవళించే తమ ప్రేమను జూపింప మనకు ||బాల|| మన జోల పాటలు ఆలించు బాలుడు దేవాది దేవుని తనయుడు గనుక వరముల నొసగి మనకు దేవుని ప్రియులుగా జేయు ||బాల||