భాసిల్లెను సిలువలో

Bhaasillenu Siluvalo

UncategorizedAdded on 10/31/2015

Lyrics

ఏ బి మాసిలామని
భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా
||భాసిల్లెను||
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి
(2)      ||భాసిల్లెను||
దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం
(2)     ||భాసిల్లెను||
పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి
(2)     ||భాసిల్లెను||
నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో
(2)     ||భాసిల్లెను||
ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని
(2)     ||భాసిల్లెను||
నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను
(2)      ||భాసిల్లెను||

Video