భజన చేయుచు భక్తపాలక
Bhajana Chaeyuchu Bhakthapaalaka
Lyricistదొరసామి ఆరోగ్యము
UncategorizedAdded on 10/1/2015
Lyrics
భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును వృజినములపై జయము నిచ్చిన విజయుడా నిను వేడుకొందు ||భజన|| దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు ||భజన|| నరుల గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుడ నైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు ||భజన|| చెడినవాడ నైన నన్ను జేరదీసి ప్రోచినావు పడిన నాడు గోతి నుండి పైకి లేవనెత్తి నావు ||భజన|| ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఇంతయని వర్ణింప నిలలో నెవనికిని సాధ్యంబు కాదు ||భజన||