భక్తులారా స్మరియించెదము
Bhakthulaaraa Smariyimchedamu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 12/27/2017
Lyrics
భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా|| గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా|| ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మనమాయనకర్పించుకొనెదము మనమాయనకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే (2) ||భక్తులారా|| కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై గనుక మనము నడచుకొనెదము గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా||