భీకరుండౌ మా యెహోవా
Bheekarumdau Maa Yehovaa
UncategorizedAdded on 1/25/2015
Lyrics
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ|| మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ || ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము || భీకరుండౌ || పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ || మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను || భీకరుండౌ || మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను || భీకరుండౌ ||