భూమియు దాని సంపూర్ణత

Bhoomiyu Daani Smpoornatha

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 8/18/2021

Lyrics

భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే
ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను
(2)        ||భూమియు||
యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు
(2)        ||భూమియు||
వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే
(2)        ||భూమియు||
నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును
(2)        ||భూమియు||
గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి
(2)        ||భూమియు||
మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే
(2)        ||భూమియు||
మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్
(2)        ||భూమియు||

Video