బంధము నీవే
Bmdhamu Neevae
Lyricistఆడమ్ బెన్ని
UncategorizedAdded on 8/1/2024
Lyrics
బంధము నీవే – స్నేహము నీవే (యేసయ్యా) అతిథివి నీవేనయ్యా ఆప్తుడా నీవేనయ్యా ప్రేమించువాడా కృప చూపువాడా నాతోనే ఉండి నను నడుపువాడా కాలాలు మారినా మారని వాడా విడువవు నను ఎప్పుడూ మరువని తండ్రివయ్యా మూగబోయిన నా గొంతులోన గానము నీవై నను చేరినావా హృదయ వీనవై మధుర గానమై నాలోనే ఉన్నావయ్యా నా ఊపిరి నీవేనయ్యా ఈ లోకములో యాత్రికుడను ఎవ్వరు లేని ఒంటరినయ్యా నీవే నాకు సర్వము దేవా చాలును చాలునయ్యా నీ సన్నిధి చాలునయ్యా