బ్రతికెద నీ కోసమే

Brathikeda Nee Kosamae

Lyricistరాజ్ ప్రకాష్ పాల్
UncategorizedAdded on 12/30/2017

Lyrics

బ్రతికెద నీ కోసమే
నా ఊపిరి నీ ధ్యానమే
నా జీవితమే నీకంకితమై –
నీదు సేవ జేతు పుణ్యమాని భావింతు
నేను చివర శ్వాస వరకు
||బ్రతికెద||
శ్రమయును బాధయు నాకు కలిగినా
వైరులు ఎల్లరు నన్ను చుట్టినా
నీదు న్యాయ శాసనమునే పాటింతు
నాలోని బలము నన్ను విడిచినా
నా కన్ను దృష్టి తప్పిపోయినా
నిన్ను చేరి నీదు శక్తి పొంద
నీదు ఆత్మ తోడ లోక రక్షకా
||బ్రతికెద||
వాక్యమే మ్రోగుట విశ్వాసము వెల్లడి చేయుట
ఇహమందున యోగ్యమైన కార్యముగా నే తలచి
నీదు రుధిరంబు చేత నేను
కడగబడిన నీదు సొత్తు కాదా
నిన్ను జూప లోకంబులోన
నీదు వెలుగు దీపముగా నాథా
||బ్రతికెద||

Video

Brathikeda Nee Kosamae Lyrics | Shining Christians