చాలునయ్య నీ కృప

Chaalunayya Nee Krupa

Lyricistనంగనూరి కాలేబు
UncategorizedAdded on 11/2/2015

Lyrics

చాలునయ్య నీ కృప నా జీవితానికి
సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా
||చాలునయ్య||
మేఘాలలోన మెరుపుంచినావు
త్యాగాల యందె మా అనురాగాలుంచినావు
సాగలేని జీవిత సమరములో
వేగమే దూతనంపి బాగుగ నిలిపావు
||చాలునయ్య||
పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు
ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు
వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా
లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా
||చాలునయ్య||

Video