చాలునయ్యా చాలునయ్యా
Chaalunayyaa Chaalunayyaa
Lyricistచాలునయ్యా చాలునయ్యా
UncategorizedAdded on 11/1/2015
Lyrics
నీ కృప నాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| జిగటగల ఊభిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా నన్ను నీవు విడువనే లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||