చేయి పట్టుకో
Chaeyi Pattuko
UncategorizedAdded on 7/11/2015
Lyrics
వి ఆల్ఫ్రెడ్ సుధాకర్ చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో ||చేయి|| కృంగిన వేళ ఓదార్పు నీవేగా నను ధైర్యపరచు నా తోడు నీవేగా మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము ||చేయి|| శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకలమే రేగిననూ విడువగలనా ఒక నిమిషమైననూ యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము ||చేయి||