చీకటులే నన్ను

Cheekatulae Nannu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 4/25/2018

Lyrics

చీకటులే నన్ను కమ్ముకొనంగా
దుఃఖంబు నాకాహారంబు కాగా
ఏకాకినై లోకంబులోన
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు –
మేఘములు నన్ను ముసుగుకొనంగా
ఉరుములు నాపై దొరలుచుండంగా
వడగండ్ల వాన కురియుచుండంగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు –
అన్యాయ క్రియలు అధికంబు కాగా
మోసంబులే నాకు వ్యసనంబు కలుగ
ఆకాశ శక్తులు కదలించబడగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు –
త్వరలోనే రమ్ము పరలోక వరుడా
వరమేని తనయా ఓ గొర్రెపిల్లా
కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు –
(2)     ||చీకటులే||

Video