చిందింది రక్తం
Chimdimdi Rakthm
UncategorizedAdded on 12/14/2017
Lyrics
కారింది రుధిరం కలువరిలోన కరుణ చూప లేదే కసాయి మనుష్యులు కనికరించలేదే మానవ లోకం (2) ||చిందింది|| ఏదేనులో పుట్టిన ఆ పాపము శాపముగా మారి మరణ పాత్రుని చేసె ఆ మరణమును తొలగించుటకు మరణ పాత్రను చేబూనావా నా మరణమును తప్పించినావా ||కరుణ|| చేసింది లోకం ఘోరమైన పాపం మోపింది నేరం నీ భుజము పైనా యెరుషలేములో పారిన నీ రక్తము ఈ లోక విమోచన క్రయధనము ఈ లోక విమోచన క్రయధనము ||కరుణ|| నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం మరణపు ముల్లును విరిచిన దేవుడా జీవకిరీటము నిచ్చుటకై ముళ్ళ కిరీటము ధరించితివా నాకు నిత్య జీవమిచ్చితివా ||కరుణ||