చింత లేదిక
Chimtha Laedika
UncategorizedAdded on 12/13/2015
Lyrics
ఎన్ డి ఏబెల్ చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి ||చింత లేదిక|| చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి ||చింత లేదిక|| కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై ||చింత లేదిక|| పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము ||చింత లేదిక||