చింతెందుకు

Chimthemduku

Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 1/23/2016

Lyrics

చింతెందుకు మీకు దిగులెందుకు
మన ప్రియులు లేరని బాధెందుకు
కష్టాలు లేని కన్నీళ్లు లేని
పరదైసులోన తానుండగా
(2)        ||చింతెందుకు||
శాశ్వతము కాదు ఈ లోకము
మన గమ్యస్థానము పరలోకము (2)
ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు
తప్పక ఈ భువిని వీడాలిగా
(2)       ||చింతెందుకు||
ఒకరోజు మన ప్రియుని చూస్తామనే
నిరీక్షణ ప్రభువు మనకొసగెగా
ఆ రోజు వరకు పరదైసులోన
అబ్రహాము చెంతన తానుండగా
||చింతెందుకు||

Video