చిన్నారి బాలగా
Chinnaari Baalagaa
UncategorizedAdded on 8/9/2017
Lyrics
కనరాని దేవుడు కనిపించెనా తన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనా జో.. లాలిజో.. జో… లాలిజో… పరలోక భోగాలు వర దూత గానాలు తనకున్న భాగ్యాలు విడనాడెనా పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనా ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే ||జో లాలిజో|| దావీదు తనయుండై మహిమా స్వరూపుండై మానుజావతారుండై పవళించెనా గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనా ప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా ||జో లాలిజో|| శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండు కడు శక్తిమంతుడు కమనీయుడు ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తాయనే అభిషిక్తుడు ఆరాధ్యుడు ప్రేమామయుడు ప్రియుడేసుడు ||జో లాలిజో||