చిరకాల స్నేహితుడా
Chirakaala Snaehithudaa
Lyricistషారోన్ ఫిలిప్
UncategorizedAdded on 10/1/2015
Lyrics
చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2) బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం ||చిరకాల స్నేహం|| కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం ||చిరకాల స్నేహం|| నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం ||చిరకాల స్నేహం||