చూచుచున్న దేవుడవయ్యా

Choochuchunna Daevudavayyaa

UncategorizedAdded on 10/6/2016

Lyrics

నీ పేరు మిటో ఎరుగనయ్యా
నా పేరుతో నన్ను పిలిచావయ్యా
(2)          ||చూచుచున్న||
శారాయి మాటలే విన్నాను
అబ్రహాము భార్యనై య్యాను
ఈ అరణ్య దారిలో ఒంటరినై
దిక్కులేక తిరుగుతున్న హాగరును
నేను హాగరును
||చూచుచున్న||
ఇష్మాయేలుకు తల్లినైతిని
అయినవారితో త్రోసివేయబడితిని
కన్నకొడుకు మరణము చూడలేక
తల్లడిల్లిపోతున్న తల్లిని నేను
అనాథ తల్లిని నేను
||చూచుచున్న||
పసివాడి మొరను ఆలకించావు
జీవజలములనిచ్చి బ్రతికించావు
నీ సంతతిని దీవింతునని
వాగ్దానమిచ్చిన దేవుడవు
గొప్ప దేవుడవు
||చూచుచున్న||

Video