చుక్క పుట్టింది
chukka puttimdhi
UncategorizedAdded on 11/30/2022
Lyrics
మోజెస్ డేవిడ్ కళ్యాణపు యుగపురుషుడు శకపురుషుడు ఇమ్మానుయేలు లోకరక్షకుడు చుక్క పుట్టింది ధరణి మురిసింది చుక్క పుట్టింది ధరణి మురిసింది రాజులకు రారాజు వచ్చాడనింది ఆకాశంలోన వెలుగే నింపింది – శ్రీ యేసు పుట్టాడని ఈ బాలుడే తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని ఈ బాలుడే మన పితరులకు వాగ్ధానం చెయ్యబడిన మెస్సయ్యా ఇతడేనని ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిమ్ దేవుడని ఈ బాలుడే నిన్న నేడు నిరంతరము ఉండువాడని.. శకమే ముగిసే నవశకమే మొదలే నింగి నేల ఆనందముతో నిండెనే దివినే విడిచే పరమాత్ముడే పాపం శాపం తొలగింప నేతెంచెనే….. శరీరధారిగా భువిలోకి వచ్చెగా – మన కోసమే ఇమ్మానుయేల్ మన పాప శాపముల్ హరింపవచ్చెగా – మన కోసమే రక్షకుడై జగత్త్పునాది వేయకముందే – ఉన్నవాడే ఉన్నవాడే అబ్రహాముకంటే ముందే – ఉన్నవాడే ఉన్నవాడే వెలుగు కమ్మని నోటితో పలికినవాడే సూర్య చంద్ర తారలను చేసినవాడే నిన్న నేడు నిరతరము నిలిచేవాడు ఈయనే నిత్యానందము నిత్యజీవము – నీకిచ్చును ఇమ్మానుయేల్ నీ చీకటంతయు తొలగింపవచ్చెగా – నీ కోసమే నీతి సూర్యుడై దుఃఖితులను ఓదార్చుటకు – వచ్చినవాడే మన యేసయ్యా పాపములను తొలగించుటకు – వచ్చినవాడే మన యేసయ్యా మంటి నుండి మానవుని చేసినవాడే మహిమను విడచి మనకోసమే వచ్చాడే కంటి పాపలా మనలను కాచేవాడు ఈయనే మహిమా స్వరూపుడే మనుజావతారిగా – మహిలోకీ వచ్చె ఇమ్మానుయేల్ మన పాప శాపముల్ హరింపవచ్చెగా – మన కోసమే రక్షకుడై (2) ||చుక్క పుట్టింది|| ఇమ్మానుయేలు ఎలోహిమ్ ఇమ్మానుయేలు ఎల్ షడ్డాయ్ ఇమ్మానుయేలు అడోనాయ్ – యావే ఇమ్మానుయేలు రాఫా ఇమ్మానుయేలు ఎల్ రోయి ఇమ్మానుయేలు ఎల్ ఓలం – షాలోమ్ ఎల్ ఇజ్రాయెల్ ఎల్ హన్నోరా ఎల్ మీకాదేష్ ఎల్ హక్కావోద్ – ఇమ్మానుయేల్ ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా నిన్న నేడు నిరతము నిలుచువాడా