చుక్క పుట్టింది
Chukka Puttimdi
UncategorizedAdded on 11/23/2019
Lyrics
మోజెస్ డేవిడ్ కళ్యాణపు వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో గొర్రెల విడచి మందల మరచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా గానములతో గంతులు వేస్తూ గగనాన్నంటేలా ఘనపరచెదం చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దాం చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో పొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో తారను చూచి తరలి వచ్చాము తూర్పు దేశపు జ్ఞానులము తన భుజముల మీద రాజ్య భారమున్న తనయుడెవరో చూడ వచ్చామమ్మా బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దాం చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో నీవేలే మా రాజు – రాజులకు రాజు నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి క్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము