దావీదు తనయా హోసన్నా
Daaveedu Thanayaa Hosannaa
Lyricistహోసన్నా…
UncategorizedAdded on 3/21/2018
Lyrics
హోసన్నా హోసన్నా హోసన్నా అయ్యా.. దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా ||దావీదు|| గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింధ్యామరలు హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింధ్యామరలు పిల్లలు పెద్దలు జగమంతా నీకై వేచెను బ్రతుకంతా ||దావీదు|| కరుణా రసమయ నీ నయనాలు సమతా మమతల సంకేతాలు హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా కరుణా రసమయ నీ నయనాలు సమతా మమతల సంకేతాలు కంచర వాహన నీ పయనాలు జనావాహినికే సుబోధకాలు ||దావీదు|| పేదల పాలిటి పెన్నిధివై పాపుల రక్షకుడైనావు హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా పేదల పాలిటి పెన్నిధివై పాపుల రక్షకుడైనావు మకుటము లేని ఓ మహరాజా పరిచితిమివిగో మా హృదయాలు ||దావీదు||