దేహం పాతది
Daehm Paathadi
UncategorizedAdded on 1/7/2016
Lyrics
జీవం పాపిది – మార్గం తెలియనిది సర్వోన్నతుడా నిత్య నూతనుడా నిత్య జీవనం కలిగించుమయ్యా మరియా కన్న తనయా ||దేహం|| దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే ||సర్వోన్నతుడా|| తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు వీడగ లేని సంసారమనే బంధం విడిపించు నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు ||సర్వోన్నతుడా||