దేవ దాసపాలక
Daeva Daasapaalaka
Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 9/2/2017
Lyrics
దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా దేవా దేవా దీన పోషకా ||దేవ|| లోక బాధ ఇరుకు శోధన నుండి స్వీకరించినావు త్రియేక దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ ||దేవ|| దిక్కులేని పాపి కొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా జయం జయం జయము నొందగా ||దేవ|| కఠినులంత కుటిలము జేసి నిన్ను గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా యిదే నా యెడ బ్రేమ జూపితి ||దేవ|| ఇంత యొర్పు యింత శాంతమా నాకై పంతముతో బాపికొరకు బ్రాణమియ్యగా పాపి నీదగు దాపు జేర్చవే ||దేవ|| కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వ మోయగా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ||దేవ||