దేవా ఇలలోన నీవు

Daevaa Ilalona Neevu

Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 10/22/2020

Lyrics

దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము
మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము
మా యజమానివి నీవై మమ్ములను నడిపించు
నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు
వందనములు అందుకో మా యేసయ్యా
కలకాలం నీ కాపుదలే కావాలయ్యా
నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా
పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా
ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యా
నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా
||వందనములు||
నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా
నీ నీడలో మే సాగుటకు మా గృహమును కట్టుమయా
శోధన వేదనలెదిరించే బలమును అందించుమయ్యా
నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా
||వందనములు||
నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి
నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి
సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి
కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి
||వందనములు||

Video