దేవా నా మొర ఆలకించుమా
Daevaa Naa Mora Aalakimchumaa
UncategorizedAdded on 8/3/2017
Lyrics
నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను దేవా నా మొర ఆలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి ఎక్కించుము నను నడిపించుము నీవు నాకు ఆశ్రయముగ నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి యుగయుగములు నేను నీ గుడారములో నుందును నీ రెక్కల చాటున దాగి యుందును నీ రెక్కల చాటున దాగి యుందును ||దేవా|| నా రక్షణ మహిమకు ఆధారము నీవే నా ఆశ్రయ దుర్గం నా నిరీక్షణ మార్గము నీవే నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా నీ పోలికగా నన్ను మలచుమయ్యా నీ పోలికగా నన్ను మలచుమయ్యా ||దేవా||