దేవా నీ ఆత్మను

Daevaa Nee Aathmanu

Lyricistడినో
UncategorizedAdded on 6/1/2018

Lyrics

దేవా నీ ఆత్మను నా నుండి
నువ్వు తీసివేయకుమా
నీ సన్నిధిలో నుండి నన్ను
నువ్వు త్రోసివేయకుమా
నీ దృష్టి యెదుటనే
చెడుతనము చేసియున్నాను
పాపిని అని ఒప్పుకొని
క్షమాపణ కోరుచున్నాను
నీవే నీవే కరుణామయుడవు నీవే
నీవే నీవే ప్రేమామయుడవు నీవే
||దేవా||
నీ వెలుగుతో నను నింపిననూ
చీకటినే కోరుకున్నాను
నా కళ్ళు నీవు తెరిచిననూ
గ్రుడ్డివాడిలా నడుచుకున్నాను
||నీ దృష్టి||
నీ ఆత్మతో నను నింపిననూ
శరీరమునే తృప్తిపరిచాను
ఆత్మచేత నడిపించబడక
శరీరాశలలో మునిగాను
||నీ దృష్టి||

Video