దేవా నీ గొప్పకార్యములన్

Daevaa Nee Goppakaaryamulan

UncategorizedAdded on 9/17/2015

Lyrics

నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం
హల్లెలూయా నా యేసురాజ
హల్లెలూయా నా ప్రాణనాథ
స్తుతులు మహిమ ఘనత నీకే
||దేవా నీ||
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
పరమును వీడి భువికరుదెంచి
కలువరి సిలువలో రక్తము కార్చి
నీదు కృపతో నను రక్షించిన
నీ దివ్య ప్రేమను అత్యధికముగా
స్మరింతున్ జీవిత కాలమంతా
||దేవా నీ||
నీ కంటిపాపగా నన్ను కాచి
నీ చేతి నీడలో నన్ను దాచి
నీ అరచేతిలో నను చెక్కుకొని
నీదు సొత్తుగా నను చేసుకొని
అక్షయమైన నీ మధుర ప్రేమను
దీక్షతో ఇలలో చాటెదను
||దేవా నీ||

Video