దేవా నీ సాక్షిగా

Daevaa Nee Saakshigaa

UncategorizedAdded on 9/14/2017

Lyrics

ఈ మంటికి భాగ్యము
జాలిగా మనుజాళికై
కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు
నా తుది శ్వాస ఆగే వరకు
||దేవా||
నాలాంటి నర మాత్రుని చేరుట
నీ వంటి పరిశుద్ధునికేలనో
ఏ మేధావికి విధితమే కాదిది
కేవలం నీ కృపే దీనికాధారము
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే
నా బ్రతుకంత కొనియాడుట
||దేవా||
నా ఊహకందని మేలుతో
నా గుండె నిండింది ప్రేమతో
నా కన్నీటిని మార్చి పన్నీరుగా
నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము
నేను ఎలుగెత్తి ప్రకటించెద
||దేవా||

Video